ఆదరించి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
ఆదరించి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
-బిఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్
ఇల్లందు, శోధన న్యూస్ : ఈ నెల 30న జగనన్న శాసన సభ ఎన్నికల్లో ఆధరించి గెలిపిస్తే ఇల్లందు ను మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. ప్రచారంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్న హరిప్రియ నాయక్ కు గ్రామాలలో ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ప్రధానంగా కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రైతు రుణమాఫీ రైతు బీమా కల్యాణ లక్ష్మి షాది ముబారక్, పెన్షన్లు పోడు రైతులకు పట్టాలు ప్రధాన అంశాలుగా తీసుకొని ప్రచారంలో తనదైన శైలి లో ప్రజలకు వివరిస్తున్నారు. మట్టి రోడ్డు లేని గ్రామాలను ఏర్పాటు చేశానని ప్రజలు ఆదరించి గెలిపిస్తే ప్రధానంగా నియోజకవర్గంలో విద్యా వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. సిఎం కేసీఆర్ నాయకత్వంలో గడిచిన ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్నీ రంగాలలో సంపూర్ణంగా అభివృద్ధి చేశానని మిగిలిపోయిన పనులు ముందుకు సాగాలంటే తిరిగి బీఆర్ఎస్ మూడోసారి అధికారులకు రావాలని అందుకు ప్రజలు అండదండలు అందించాలని కోరారు. బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల జీవితాలలో వెలుగు లు నింపుతుందని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఈ ఐదేళ్లలో 1800 కోట్ల రూపాయలను నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చానని ఆ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అభివృద్ధి మరింత పరుగులు తీయడానికి టిఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. నా ప్రయాణంలో అనుక్షణం వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్న ఈ కొద్ది కాలాన్ని అలుపెరగకుండా సద్వినియోగం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు హిత బోధ చేస్తున్నారు. ప్రచార పర్వంలో హరిప్రియ నాయక్ అగ్ర భాగాన ముందుకు దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ప్రజలు పూలవర్షం హారతులతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రచార సందర్భంగా ప్రజల నుండి వస్తున్న స్పందన అనుహంగా ఉందని బిఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేని ఆ పార్టీ నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు.