ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే సిపిఎం ను గెలిపించండి
ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే సిపిఎం ను గెలిపించండి
-సిపిఎం పార్టీ అభ్యర్థి దుగ్గి కృష్ణ
ఇల్లందు , శోధన న్యూస్ : ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే సిపిఎం ను గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్ది దుగ్గి కృష్ణ ఓటర్లను కోరారు. ఇల్లందు నియోజకవర్గం లో గెలిచినా కాంగ్రెస్, తెరాస పార్టీలు అభివృద్ధి ని విస్మరించి స్వంత ప్రయోజనాల కోసం పార్టీ ల రంగులు మార్చుకుంటూ వచ్చారని అన్నారు. ఇల్లందు మండలం రొంపేడు, కొమరారం, పోలారం, బొంబాయి తండా,మర్రిగూడెం, ఎల్లపురం, మాణిక్యారం, మసీవాగు, సుదీమల్ల, పూబెల్లి, రాగబోయిన గూడెం, తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వీరపురంలో వరి కళ్లెం వద్ద వ్యవసాయ పనులు చేస్తూ వ్యవసాయ కూలిలను ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఎల్లపురం లో హమాలీ లను కలిసి హమాలీ కోసం వారి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేసిన పోరాటాలను గుర్తు చేయడం జరిగింది.ఈ ప్రచారంలో వజ్జ, సురేష్, కొడెం బోస్,మోలుగు శ్రీను,శాంతయ్యా , నాగేందర్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.