ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల
సత్తుపల్లి, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే నూతన కార్యాలయాన్ని బుధవారం ద్వారకాపురి కాలనీ రోడ్ నెంబర్ 7 నందు మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. నూతన కార్యాలయం ప్రారంభానికి ముందు అయ్యప్ప స్వామి గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని పండితుల ఆశీర్వాదం పొంది, చర్చిలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కు తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మట్టా రాగమయి నూతన కార్యాలయంలో తన కుర్చీలో కూర్చునే ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నమస్కరించి బాధ్యతలు స్వీకరించారు.