ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన అవసరం -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి
ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన అవసరం
-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి
చుంచుపల్లి , శోధన న్యూస్ :ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు అందరు కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి భానుమతి అన్నారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చుంచుపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పాటించాలని తెలిపారు. యుక్త వయసు వారు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ మహమ్మారి బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఎయిడ్స్ సోకిన వారిని చులకనగ చూడవద్దని, వారి పట్ల వివక్ష చూపరాధని తెలిపారు. కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ చర్మ వ్యాధుల డాక్టర్ మోహన కృష్ణ రెడ్డి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యలకు బానిస కావద్దని సూచించారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ఏమైన అనుమానం ఉన్నట్లయితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. యువత చెడు మార్గాలను ఎంచుకొని హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్నారని అన్నారు. ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారితో సహజీవనం, కలిసి ఉండటం, కలిసి భుజించడం వలన వ్యాధి రాదని, రక్త మార్పిడి, సూదులు, లైంగిక సంబంధాల వల్ల వ్యాధి సోకుతుందని తెలిపారు. ఈ వ్యాధి పట్ల విద్యార్థులకు కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఎంతైన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్, జనరల్ సెక్రెటరీ ఆర్. రామారావు, చీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యాయవాదులు లక్కినేని సత్యనారాయణ, మెండు రాజమల్లు, శ్రీనివాసరావు,కళాశాల ప్రిన్సిపల్ జె.రమేష్,అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ జ్యోతి విశ్వకర్మ, నాగ స్రవంతి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.