ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నాగుల్ మీరా
ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నాగుల్ మీరా
జులూరుపాడు, శోధన న్యూస్: అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడి గా జూలూరుపాడు మండలానికి చెందిన ఎస్ కె నాగుల్ మీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఏఐవైఎఫ్ రెండవ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకునట్లు నాగుల్ మీరా తెలిపారు.ఈ సందర్భంగా నాగుల్ మీరు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలను నిర్వహించనన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,ఉద్యోగాలను భర్తీ చేయాలని పోరాటం చేశానని నాగుల్ మీరా వెల్లడించారు. రాష్ట్ర స్థాయి పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక చేయటం పట్ల రాష్ట్ర సమితి సభ్యులకు నాగుల్ మీరా ధన్యవాదాలు తెలిపారు.