ఐక్యమత్యంతో పనిచేసి పాయంని గెలిపించాలి
ఐక్యమత్యంతో పనిచేసి పాయంని గెలిపించాలి
కరకగూడెం, శోధన న్యూస్ : ఐక్యమత్యంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ పినపాక అసెంబ్లీ అభ్యర్ది పాయం వెంకటేశ్వర్లుని గెలిపించాలని కాంగ్రెస్, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. మండ ల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ పినపాక నియోజకవర్గ కార్యదర్శి పుల్లారెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాఅధ్యక్షులు సొందే కుటుంబరావు, టిడిపి పార్టీ నియోజకవర్గ నాయకులు వట్టం నారాయణ దొర, టిఎన్టియుసి అధ్యక్షులు పోటు రంగారావు హాజరై మాట్లాడారు. పినపాక నియోజకవర్గ గడ్డ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసపూరిత హామీలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కుటుంబ పాలనతో అప్పుల పాలయ్యిందని అన్నారు. లిక్కర్ స్కాం, లీక్ ల స్కామ్ తో రాష్ట్ర ప్రతిష్టను భ్రష్టు పట్టించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్నిదే అని ఏద్దేవ చేశారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించారని అన్నారు. పినపాక నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్, సిపిఐ, టిడిపి, వైఎస్అర్ టిపి, టీజేఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశం లో నాయకులు వంగరి సతీష్, సిరి శెట్టి కమలాకర్, నాగ బండి వెంకటేశ్వర్లు, కునుసోత్ సాగర్, చందా వెంకటరత్నమ్మ, ఎర్ర సురేష్, జలగం కృష్ణ, షేక్ రఫీ, దంచనాల రాము, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు అనుబంధ సంఘాలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
