తెలంగాణ

కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు కాపి కొట్టిన కేసీఆర్

 

కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు కాపి కొట్టిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా, శోధన న్యూస్:

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లను కేసీఆర్ కాపీ కొట్టారని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము ఆరు గ్యారంటీ పథకాలు ప్రకటిస్తే బి ఆర్ ఎస్ నేతలు ఇవి అమలు సాధ్యం కానీ పథకాలు అని, వీటికి బడ్జెట్ సరిపోదు అని చెప్పిన వాళ్ళు మరి ఇప్పుడు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పిన కచ్చితంగా చేసి చూపుతుందని, కర్ణాటకలో తాము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.బి ఆర్ ఎస్ పార్టీ అంటే కేవలం నలుగురు మాత్రమేనని, కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ అని చెప్పారు.దేశం లో తాము విప్లవత్మకాంమైనా మార్పు తెస్తామని అన్నారు.బి ఆర్ ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ఇప్పటికి నెరవేర్చలేదని కొత్తగా మరిన్ని పథకాలతో ప్రజలను మోసం చేయడం కోసమే బి ఆర్ ఎస్ హామీలు ఇస్తోందని ఎద్దేవా చేశారు.గత ఎన్నికల్లో ఇచ్చిన దళితుల కు మూడు ఎకరాలు భూమి, నిరుద్యోగ భృతి, ప్రతి పేదవాడికి ఇల్లు, రైతులకు రుణ మాఫీ ఏమైందని ప్రశ్నించారు.ఇప్పటికి గ్రామాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇంకా ఉన్నాయని,.. మీరు కట్టిన రెండు పడకల ఇండ్లు ఎక్కడ ఉన్నవని ప్రశ్నించారు.మీరు కేవలం మీ పార్టీ వాళ్లకి మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్రము లో ఇప్పటికి ఒక్క రేషన్ కార్డు కూడ ఇవ్వని దౌర్బాగ్యం కేసీఆర్ ది అని,.. ఆహార భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.పేదల మీద ఈ పార్టీకి ప్రేమ లేదన్నారు. వారి కడుపు నింపాలనే ద్యాస వీళ్లకు లేదు అన్నారు. కార్పొరేట్ వైద్యం పేదలకు అందించిన ఘనత కాంగ్రెస్ కు ఉందన్నారు. మేము దళితులకు ఇచ్చిన లక్షల ఎకరాల భూములు అభివృద్ధి పేరుతో లాక్కున్న దుర్మార్గం మీది…. ఇప్పుడు కొత్తగా వారికి అసైండ్ భూముల మీద హక్కులు కాల్పిస్తామనడం సిగ్గు చేటు అన్నారు.ఉద్యోగుల పెన్సషన్ కోసం అధ్యయనం కమిటీ వేస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళను మోసం చేస్తున్నారు. ఉద్యోగులు కేసీఆర్ మాయ మాటలకూ మోసపోరాదని సూచించారు.బి ఆర్ ఎస్ గత మ్యానిపెస్టోలో చెప్పిన కేజీ టు పి జి ఉచిత విద్య ఏమైంది అని అడిగారు. రాష్ట్రములో ఉన్న ప్రభుత్వ బడులను మార్పు చేసి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తు చేశారు.గురు కులాలకు ఇప్పటికి సొంత భవనాలు లేవని,ఉద్యోగాల కల్పనా మీద ఇప్పటికి స్పష్టత లేదని,నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాము మేనిపెస్టో లో చెప్పిన విదంగా అధికారంలో కి వచ్చిన వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.స్థానిక మాజీ మంత్రి ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఔట్ సోర్సింగ్ ద్వారా తన మనుషులను పెట్టుకొని పాలన చేస్తున్నాడని, ప్రభుత్వ అధికారులకు స్వేచ్చ లేకుండా చేశాడని అన్నారు. హుజురాబాద్ లో మాదిరి దళితులందరికి దళిత బందు ఒకేసారి ఇవ్వాలన్నారు. దళిత బందు ద్వారా గ్రామాల లో చిచ్చు పెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు దళిత బందు రావడం లేదు… కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలుకు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. దీనికి కూడా 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని, ఎ సి బి వాళ్ళు దళిత బందు లో కమిషన్ తీసుకుంటున్న శాసనసభ్యుల మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం లో న్యాయ బద్దంగా ఉన్న అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ భూ స్వామ్య ఆలోచన తో పెద్ద పెద్ద భూ స్వాములకు రైతు బందు ఇచ్చావు.. మరి కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.రైతు కూలీల పరిస్థితి ఏంటి ప్రజలకు చెప్పాలి అన్నారు.తాము అధికారం లోకి వచ్చాక రైతులతో పాటు కౌలు రైతులకు కూడ సంవత్సరానీకి 12వేలు ఇస్తాము అన్నారు. జర్నలిస్టులను మోసం చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. కనీసం వారికి అక్రీడేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు ఎస్ వినోద్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు ఎర్పుల నాగరాజు, సిరాజ్ ఖాద్రి,సి జె బెనహర్,జె చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *