కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం
కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం
మణుగూరు, శోధన న్యూస్ : మణుగూరు మండల సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ గ్రామంలోనీ 132వ బూత్ లో కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గెలుపుకై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిరనాకి నవీన్, సమితి సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, మండల నాయకులు గాండ్ల సురేష్, కొలపెన్ని మానస, గద్దల ఆదిలక్ష్మి, గంగపురి మురళి, పోయిలపొంగు కుమారి, ఠాగూర్ చరణ్ సింగ్, పద్మ, రాము, ఎడ్ల యుగేందర్, ఎడ్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.