తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు 

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు 

మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కోతగుడెం జిల్లా మణుగూరు మండలంలోని కూనవరం గ్రామ పంచాయితీ
కూనవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే పాయంకు పై  గుంపు  గ్రామస్తులు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం  ప్రజలకు  చేసింది ఏమీ లేదని, మోసపూరిత మాటలు చెప్పి  మభ్య పెడుతూ కాలం వెళ్ళదీస్తోందన్నారు.  వచ్చే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించి గెలిపించాలన్నారు.  అనతరం గ్రామానికి చెందిన 150 కుటుంబాల వారు  బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. వీరికి అయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఆత్మ కమిటీ డైరెక్టర్ ముసలి శీను,  మాజీ ఎంపీటీసీ ఏనిక కామరాజు ,  ఏనిక గురవయ్య, ఏనిక రామకృష్ణ తదితరులు ఉన్నారు.  ఈ కార్యక్రమంలో మణుగూరు మండల వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ లు పుచ్చకాయల శంకర్, గోరంట్ల కనకయ్య, వీరంకి వెంకటరావు గౌడ్, మాజీ ఎంపీటీసీ ఈసాల ఏడుకొండలు, మాజీ వార్డ్ నెంబర్ తోలేం నాగేశ్వరరావు, టీవీ సుబ్బారెడ్డి, మాదాడి రాజేష్, పాల్వంచ రాములు, కొమరం రామ్మూర్తి, కొడెం సాంబశివరావు, కారం సూరయ్య, కటుకూరి శ్రీనివాసరావు, ఏనిక బాలు, ఏనిక దినేష్, కంగాల తాతారావు, పాయం నాగరాజు, కంగాల నాగేంద్రబాబు, పాల్వంచ శీను, కారం నాగేంద్రబాబు, ఓబి కాంట్రాక్టర్స్ వర్కర్స్ యూనియన్, కొల పిన్ని మానస, గద్దల ఆదిలక్ష్మి, పాల్వంచ సుజాత తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *