తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

కిరాణా, పాన్ షాపుల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

కిరాణా, పాన్ షాపుల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

పినపాక, శోధన న్యూస్: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని పలు కిరాణా దుకాణాల్లో ఏడూళ్ళబయ్యారం సీఐ శివప్రసాద్, ఎస్సై టి వెంకటప్పయ్య మంగళవారం తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చె పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు తినే చాక్లెట్లలో మత్తు పదార్ధాలను కలిపి అమ్ముతున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేపట్టామన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గంజాయి కలిపి చాక్లెట్లు తయారు చేస్తూ.. అమ్మకాలు జరుపుతున్నారని, వాటిని అరికట్టేందుకుభాగంగా ఈ తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవె క్షణ ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని సూచించారు.

-మణుగూరులో:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని కిరాణా, పాన్ షాపుల్లో జిల్లా ఎస్పీ రోహిన్రాజ్, మణుగూరు డీఎస్పీ ఎస్వి రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు సీఐ రమాకాంత్ నేతృత్వంలో ఎస్సైలు శ్రీనివాస్. రాజేష్ కుమార్లు తమ సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాల్లోని చాక్లెట్ పదార్ధాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయికి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయిని. మత్తు పదార్ధాల విక్రయాలకు పాల్పడిన. సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *