తెలంగాణ

 కెసిఆర్‌ తోనే సబండవర్గాల అభివృద్ది 

  కెసిఆర్‌ తోనే సబండవర్గాల అభివృద్ది 

  • కెసిఆర్‌ పోటోలతో  నాయిబ్రాహ్మణ సంఘం వినుత్న ప్రచారం  

సిద్దిపేట, శోధన న్యూస్ :  వచ్చేది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, సబండవర్గాల అభివృద్ది కెసిఆర్‌తోనేనని నాయిబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్వాల్‌ యాదనరేందర్‌ అన్నారు. సిఎం  కెసిఆర్‌ పై  అభిమానంతో స్థానిక పాత మార్కెటులో గల నాయిబ్రాహ్మణుల వీధిలో ఉన్న సెలూన్‌ షాపులలో నాయిబ్రాహ్మణ సంఘం సిఎం కెసిఆర్ ఫోటోలను పంపిణీ చేస్తూ  ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొత్వాల్ యాదనరెంధర్ మాట్లాడుతూ..  నాయిబ్రాహ్మణుల ఓట్లు అన్ని కారు గుర్తుకే అని, సిద్దిపేటలో లక్ష యాబైవేలకు పైన మెజారిటీని హరీష్‌రావుకి బహుమతిగా ఇస్తామని అన్నారు. మూడో సారి ముఖ్యమంత్రిగా  కెసిఆరే  ఔతారని ధీమా వ్యక్తం చేశారు.  బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని నాయిబ్రాహ్మణులు అందరు ముఖ్తకంఠంతో  తెలిపారు. ఈ కార్యక్రమంలో   వార్డు కౌన్సిలర్‌ గుడాల శ్రీకాంత్,కొత్వాల్‌ నాగయ్య, కొత్వాల్‌ రాజు, కొత్వాల్‌ నాగరాజు, కొత్వాల్‌ శంకర్‌, కొత్వాల్‌ శ్రీనివాస్‌, కొత్వాల్‌ మదుబాబు, కొత్వాల్‌ మనోజ్‌, కొత్వాల్‌ శ్రీకాంత్‌, కొత్వాల్‌ సుభాష్, కొత్వాల్‌ లిఖిత్‌, కొత్వాల్‌ అనిల్‌, ఇన్యాలపు స్వామి కొండబత్తిని రాజ్‌కోటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *