కేంద్ర సాయిధ పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్
కేంద్ర సాయిధ పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్
ఏన్కూరు, శోధన న్యూస్ : ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నియంత్రించ డమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకుంటుంద ని వైరా సీఐ సాగర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ఆందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా..రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సు ని ర్వహిస్తున్న ఫ్లాగ్ మార్చ్ లో భాగంగా మండల కేంద్రమైన ఏనుకూరులో స్థానిక పోలీ స్ స్టేషన్ నుండి శిరిడి సాయిబాబా మందిరం వరకు,అక్కడనుండి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి థియేటర్ వరకు కేంద్ర సాయిధ పోలీసు బలగాలతో వీధుల్లో కవాతు నిర్వ హించారు.ఈ సందర్భంగా సీఐ సాగర్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎక్క డ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛ గా పారదర్శకంగా ఓటర్ల తమ హక్కును సద్వినియోగం చేసుకునేందుకు పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సూచనల మేరకు కేంద్ర బలగాలు,స్థానిక పోలీసులతో కలి సి ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వినియోగించుకు నే విధంగా ఉండాలన్నారు.అందుకోసమే గ్రామాలలో ప్రజలకు అండగా ఉన్నామని సాంకేతం ఇచ్చేందుకు ఈ విధమైన కవాతులు నిర్వహిస్తుంటామని ఆయన పేర్కొ న్నారు.శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి చర్యలకు వెనకాడబోమని ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏన్కూరు ఎస్ఐ బాదావత్తు రవి, జూలూరుపాడు ఎస్ఐ పురుషో త్తం,సిఆర్పిఎఫ్ బృందం,స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.