క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి సమాధానం ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటమే క్రిస్మస్ అని ఆమె అన్నారు. అనంతరం ఆమె కేక్ కట్ చేసి తెలంగాణ ప్రభుత్వం అందించే కానుకలను క్రైస్తవలకు అందజేశారు ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాఘవరెడ్డి, వైస్ ఎంపిపి కెవి రావు, సర్పంచులు బచ్చల భారతి, తాటి సావిత్రి, ఉపసర్పంచులు పుచ్చకాయల శంకర్, తరుణ్ రెడ్డి, ఆర్ఐలు శ్రీనివాస్, లీలావతి, ఎంపీటీసీ జి కోటేశ్వర రావు, మండల పాస్టర్లు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు.