ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
– మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దల నాగేశ్వర రావు
అశ్వాపురం, శోధన న్యూస్ : మాదిగలకు 12%శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీలలో మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా పిడమర్తి రవి నాయకత్వంలో జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్దల నాగేశ్వరరావు కోరారు. మంగళవారం హైదరాబాద్ – సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాదిగ జేఏసీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రకటించడం జరిగింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్ట బద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ మాదిగ సంఘాల ఐక్య వేదిక నాయకుల తో పాటు మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కోడారి దీరన్, జిల్లా సీనియర్ నాయకులు సిద్దెల తిరుమల రావు, మిడి దొడ్డి సంపత్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.