జనసేన తోనే సామాజిక న్యాయం సాధ్యం
జనసేన తోనే సామాజిక న్యాయం సాధ్యం
వైరా, శోధన న్యూస్ : వైరా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కావాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమని తేజావత్ సంపత్ నాయక్ అన్నారు. గురువారం బిజెపి బలపరిచిన జనసేన అభ్యర్థి సంపత్ నాయక్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కావాలంటే బిజెపి బలపరిచిన జనసేన పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపి ఆదరించి సహకరించాలని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ జనసేన కార్యకర్తలు, బిజెపి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.