జోరుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే మెచ్చా ప్రచారం
జోరుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే మెచ్చా ప్రచారం
-అడుగడుగున నీరాజనం పడుతున్న ప్రజలు
అశ్వారావుపేట, శోధన న్యూస్ : అశ్వారావుపేట నియోజక వర్గ బిఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా.నాగేశ్వర రావు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం లో భాగంగా తిరుమల కుంట గ్రామ పంచాయతీ లో ఇంటింటికీ తిరుగుతూ.. బిఆర్ఎస్ మేనిఫెస్టో, ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరిస్తూ.. జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.