ఖమ్మంతెలంగాణ

డిప్యూటీ సీఎంను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

డిప్యూటీ సీఎంను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

మధిర, శోధన న్యూస్ :   తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్తు మరియు ప్రణాళిక అమలు మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ప్రగతి భవన్లో అధికారికంగా గృహప్రవేశం చేసిన మల్లు భట్టి విక్రమార్క ను మధిర మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం హైదరాబాదులోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్లో పుష్పగుచ్చం దుశాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మదిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మాట్లాడుతూ మధిర ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మధిర కి గర్వకారణం అన్నారు. మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో మధిర నియోజకవర్గం రానున్న రోజుల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరోగ్య పథకాలను వంద రోజుల్లో అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. వీటిలో రెండు పథకాలను ప్రస్తుతం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో  పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్తా దెందుకూరు సొసైటీ చైర్మన్ కోటా వెంకటకృష్ణ దెందుకూరు గ్రామ సర్పంచ్ కోటా విజయశాంతి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు కౌన్సిలర్ కోనా ధని కుమార్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు దుంపా వెంకటేశ్వర రెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు నిడమానూరి వంశీకృష్ణ, పారుపల్లి విజయ్ కుమార్ మండల బీసీ సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చిరామయ్య, సైదలి పురం సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధారా బాలరాజు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య, గొల్లమందల శ్రీనివాసరావు, పుట్ట పుల్లారావు, డేవిడ్, రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *