తునికి చెట్ల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు-ఎఫ్ ఆర్ఓ తేజస్వి
తునికి చెట్ల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు
-ఏడూళ్ళ బయ్యారం ఎఫ్ ఆర్ఓ తేజస్వి
పినపాక, శోధన న్యూస్: తునికి చెట్ల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏడూళ్ళ బయ్యారం ఎఫ్ ఆర్ఓ తేజస్వి తెలిపారు. ఏడూళ్ళ బయ్యారం రేంజ్ పరిధిలో గల రిజర్వు ఫారెస్ట్ ఏరియాలలో ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జన ఆవాసాలలో రెస్క్యూ చేసి పట్టుకున్న పాములను వాటికి ఆవాసాలైనా తునికి చెట్లు ఉన్న ఏరియాలలో వదిలివేయడం జరిగిందని ఎఫ్ ఆర్ఓ తేజస్వి తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ఓ మాట్లాడుతూ తునికి చెట్ల పరిరక్షణ కోసం, అడవిలోనే ప్రతి ఒక చెట్టును పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రేంజ్ పరిధిలోని సమస్త ప్రజలందరూ అడవిలోనికి వెళ్ళినప్పుడు తునికి చెట్లు ఉన్న ఏరియా దగ్గరికి వెళ్లడం, వాటిని నరకడం గానీ చేయకూడదని, గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.