తృటిలో తప్పిన పెను ప్రమాదం
తృటిలో తప్పిన పెను ప్రమాదం…
వైరా, శోధన న్యూస్ : వైరా మండలం తాటిపూడి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది . మధిర నుంచి ఖమ్మం వస్తున్న ఆర్టీసీ బస్సు, విశాఖపట్నం నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న లారీ తాటిపూడి గ్రామం వద్ద వర్షంలో ఢీకున్నాయి. దీంతో బస్సు లారీ డ్యామేజ్ అయ్యాయి. బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ జామ్ కావటంతో వైరా ఎస్సై మేడాప్రసాద్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.