ఖమ్మంతెలంగాణ

తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం

తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం

ఖమ్మం, శోధన న్యూస్ : ఖమ్మం పట్టణ ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం పార్లమెంట్ ఇంఛార్జ్ కూరపాటి వేంకటేశ్వర్లు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం  నిర్వహించారు. సమ్మేళనం లో పాల్గొన్న తుమ్మల మాట్లాడుతూ.. నాకు రాజకీయ జన్మ ఇచ్చిన పూజ్యులు ఎన్టీఆర్ రాష్ట్ర విభజన తో ప్రాంతీయ పార్టీలకు ఒకే రాష్ట్రంలో అవకాశాలు అవమానాలు ఎదురైనా తెలుగుదేశం లోనే ఉన్నా మార్చి 29 న దేవుడు ఎన్టీఆర్, పెట్టిన ముహూర్తం ఆ దేవుడు కూడా మార్చలేడన్నారు. గోదావరి జలాల తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయాలనేది నా ఆశయం చిన్న వయస్సులో ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.
ఎన్టీఆర్ ఆగస్ట్ సంక్షోభం తరువాత జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ లకు అవకాశం కమ్యునిస్ట్ పార్టీలకు అవకాశాలు ఇస్తూనే తెలుగుదేశం బలోపేతం చేసా నా రాజకీయ లక్ష్యం పూజ్యులు ఎన్టీఆర్ బాటలో రైతాంగం కోసం పనిచేయడం
నాకు పదవులు అవసరం లేదు. జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా బరిలో ఉన్నానని,  భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ నన్ను అక్కున చేర్చుకుందన్నారు. ఖమ్మం గెలుపు తెలంగాణ గెలుపు నేను కష్టపడ్డ పార్టీ నన్ను ఓడించిందంటే ఆ పార్టీలో ఉండకూడదు అని వచ్చానాన్నారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు. ఖమ్మం లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ రాజకీయాల్లో మలుపు తెలుగుదేశం పార్టీ నాకు మద్దతు గా నిలిచారంటే ముప్పై ఏళ్ల కష్టం కు గౌరవం దక్కిందన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు ఇవి రాష్ట్రం అంతా వదిలి ఖమ్మం పాలేరు లో ఓడించాలని బీఅర్ఎస్ ప్రయత్నం చేస్తోన్నారన్నారు. మీ తరం కాదు ఈ ఎన్నికలు…అహంకారానికి ఆత్మ గౌరవం కు మద్య జరుగుతున్న ఎన్నికలు సన్నాసుల్లా బతికే జాతి కాదు తల ఎత్తుకుని బతికే జాతి మనది నా గెలుపు కోసం మద్దతుగా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *