నరసింహ స్వామిని దర్శించుకున్న అయ్యప్ప స్వాములు
నరసింహ స్వామిని దర్శించుకున్న అయ్యప్ప స్వాములు
ఆళ్లపల్లి, శోధన న్యూస్: మండల పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన 31 మంది అయ్యప్ప స్వాములు నుండి పాదయాత్రలుగా బయలుదేరి పాతూరు గ్రామపంచాయతీలో గల తీగలంచ ఉడుముల గుట్టపై వెలసిన నరసింహస్వామి గుడివద్దకు వెళ్లి నరసింహ స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి, దర్శనాలు చేసుకున్నారు. నరసింహ స్వామి దీవెనలు, మండల ప్రజలపై నిండుగా, నిండుగా ఉండాలని, రైతులకు పాడిపంటలు, సిరిసంపదలు, తలతూగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సుఖ సంతోషాలుగా జీవించాలని, ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ప్రత్యేకంగా పూజలను చేయడం జరిగిందని అయ్యప్ప స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రణం మల్లికార్జున్ స్వామి, పోదిల రాము స్వామి, మన్యం సుబ్బారావు స్వామి, వ్యాసారపు శ్రీనుస్వామి, తాళ్లపల్లి శేఖర్, అఖిల్, వినయ్, నవజీవన్, రవి, పొదలబోయిన అశోక్, సుతారి అజయ్, చిలువేరి సతీష్, ఆరేళ్ల లక్ష్మీనారాయణ, వేణు, చామకూర నరేష్, కొరుకోప్పుల సాగర్, యాసారపు సాగర్, ఈశ్వరోజు సద్గుర్ణనాచారి, కోనేటి వీరభద్రాచారి, యుగేంద్రాచారి, నాగేష్, సిద్దు, దయాకర్, రామ్ చరణ్ సాయి, శివ సాయి, విద్యాశంకర్, కొమరం సుధాకర్, కేసరి చింటూ, సాయిరాం, చిట్టిమల్ల కిరణ్ తదితర స్వాములు ఉన్నారు.