తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

 నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు- మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు

 నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు 
– మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు
మణుగూరు. శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నేడు నియోజకవర్గంలో 144సెక్షన్ అమలులో ఉంటుందని, మధ్యం విక్రయాలపై నిషేదించి దుకాణాలన్ని మూసి ఉంచాలని మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఉదయం 6గంటల నుండి సోమవారం ఉదయం 6గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రధాన సెంటర్లలో పోలీసుల పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలెవ్వరు కూడా గుంపులు గుంపులుగా సంచరించరాదని, బాణాసంచా పేల్చడం, ర్యాలీలు, చేయొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని,   ఎలక్షన్ కోడ్ కు సంబంధించి కేసులు నమోదు చేస్తామని ఆయన  హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *