నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు –మణుగూరు సీఐ రమాకాంత్
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
–మణుగూరు సీఐ రమాకాంత్
మణుగూరు, శోధన న్యూస్: నిబంధ నలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మణుగూరు సీఐ ఏ రమాకాంత్ తెలిపారు. సంతోషకర మైన వాతా వరణంలో జరుపు క నే నూతన సంవత్సర వేడు కలలో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారీనపడి మీ కుటుంబాలలో విషాదం నింపే పరిస్థితి తీసుకొని రాకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా వేడుకలు జరుపు కొవాలని సూచించారు. 31వ తేదీ నేటి రాత్రి నిర్ణీత సమయంలోనే మద్యం దుకాణాలు, డాబాలు, బార్లు, రెస్టా రెంట్లు, హోటల్లు మూసివేయాలన్నారు. ప్రధాన కూడళ్ళలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని సూచిం చారు. వాహన చోదకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ర్యాలీలు, బాణసంచా పేలుడు నిషిద్దమని తెలిపారు. హైస్పీడ్ నియంత్రణకు బారీగేట్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీలు చేయాలని, మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటువంటి వారి పట్ల కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసుబందో బస్తు, అన్ని ప్రాంతాలలో పోలీస్ పెట్రోలీంగ్, విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, ఎవరైనా మహిళల పట్ల అడ సభ్యకరంగా ప్రవర్తించిన కేసులు నమోదు చేయా లని అధికారులకు ఆదేశించినట్లు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు సజావుగా జరుపుకునే విధంగా పోలీసులకు సహకారించాలి అన్నారు.