పన్నెండు కేజీల గంజాయి పట్టివేత
పన్నెండు కేజీల గంజాయి పట్టివేత
కొణిజర్ల, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో ద్విచక్ర వాహనం పై అక్రమంగా తరలిస్తున్న పన్నెండు కేజీల గంజాయిని, వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.ఎక్సైజ్ పోలీస్ శాఖ సమాచారం ప్రకారం…ఒరిస్సా నుంచి హైదరాబాదుకు అక్రమంగా ద్విచక్ర వాహనంపై 12 కేజీల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పల్లిపాడు సమీపంలోని ఎక్సైజ్ పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా తరలిస్తున్న గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని,గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎక్సైజ్ పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.