పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
అశ్వాపురం,శోధన న్యూస్: అశ్వాపురం మండలంలోని అశ్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2000 – 2001 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరం వారికి విద్యాభ్యాసం నేర్పిన ఉపాధ్యాయులను సాధరంగా ఆహ్వానించి శాలువా,పూల బొకేలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులందరిని ఆశీర్వదించారు. తరువాత పూర్వ విద్యార్థులు వారి వారి విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా ఆడపాటలతో సంతోషంగా సమ్మేళనాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.