పేద ప్రజలకు అండ కమ్యూనిస్టు పార్టీ జెండా
పేద ప్రజలకు అండ కమ్యూనిస్టు పార్టీ జెండా
జూలూరుపాడు, శోధన న్యూస్ : పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అండగా ఉండేది భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)మాత్రమేనని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ అన్నారు.మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా సిపిఐ పార్టీ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 1925 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ భారత దేశంలో స్థాపించారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కార్మికులు, రైతుల పక్షాన నిరంతరం పోరాడుతున్నది సిపిఐ పార్టీ నాయకత్వం లోని ఎర్రజెండా మాత్రమేనని చండ్ర నరేంద్ర కుమార్ స్పష్టంచేశారు.పేద ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు నాయకులు జైలు జీవితాలు గడిపారన్నారు.సిపిఐ పార్టీ పోరాటంలో అనేక మంది నాయకులు ప్రాణ త్యాగాలు చేసారని అన్నారు.అమరుల ఆశయ సాధన కోసం సిపిఐ పార్టీ కార్యకర్తలు ముందుండి పోరాటం చేయాలని చండ్ర నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు,ఏఐవైఫ్ జిల్లా కార్యదర్శి ఎస్క్ నాగుల్ మీరా,చింత స్వరాజ్ రావు, ఎల్లంకి మధు,యాసా రోశయ్య , గార్లపాటి వీరభద్రం, ఎస్కే చాంద్ పాషా,తూము కోటయ్య, సిరిపురపు వెంకటేశ్వర్లు,పొన్నెకంటి వెంకటేశ్వర్లు, గుడిమెట్ల సీతయ్య, బడుగు వీరస్వామి, బరగడ రమేష్, పవన్, దర్శనాలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.