పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
– వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్
వైరా, శోధన న్యూస్: పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం కోస్టాల గ్రామంలో ప్రజా పాలన అభయహస్తం గ్యారెంటీ పథకాల దరఖాస్తుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ దయవల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజులలో పూర్తి చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో దరఖాస్తులు స్వీకరించి పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ కస్తాల సత్యనారాయణ, ఏసిపి రహమాన్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.