పోలీసు శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు.
సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత.
హుస్నాబాద్ , శోధన న్యూస్: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు సిద్దిపేట కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు 8వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న విద్యార్థులు తెలంగాణ పోలీసు శాఖ వారు నిర్వాణహించే ఆన్లైన్ వ్యాస రచన పోటీలో తెలుగు,ఉర్దూ,ఇంగ్లీషులో మీడియం భాషల్లో ఉఃటందన్నారు.మొదటి విభాగంలో 8 తరగతి నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న విద్యార్థులు అర్హులు,రెండవ విభాగంలో డిగ్రీ నుండి ఆపై తరగతుల వరకు చదుకున్నవారు అర్హులని ఈ పోటీల్లో పాల్గొనటానికి ఈ క్రింది లింకు ఓపెన్ చేసి https://forms.gle/b7bejvzfo6j29Vuz6.తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మూడు భాషలలో రాయవచ్చన్నారు.పూర్తి చేసిన వ్యాసాన్ని 23-10-2023 రోజున సాయంత్రం ఐదు గంటలలోపు సబ్మిట్ చేయాలన్నారు.జిల్లాలోఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు పోలీసు కమీషనర్లు బహుమతి ప్రదానం చేస్తారని ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా పోలీసు కమిషనరేట్ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుందని,అన్ని జిల్లా కమీషనరేట్ల స్థాయిలో బహుమతులు గెలుపొందిన వ్యాసాల నుండి ఉత్తమ మూడు వ్యాసాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యాసాలుగా తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుందన్నారు.