పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి
– పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర శాసన ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో ఎన్నికల విధులు నిర్వర్తించి అధికారులు, సిబ్బంది నేడు నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని పినపాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటు హక్కు కలిగిన పిఓలు, ఓపిఓలు, పోలీస్ అధికారులకు మణుగూరు ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరం, రిటర్నింగ్ అధికారి కార్యాలయ సముదాయంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5గంటల లోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఎన్నికల అధికారులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.