ఖమ్మంతెలంగాణ

ప్రజల కోసం పనిచేసే  ఎర్రజెండాని గెలిపించాలి

ప్రజల కోసం పనిచేసే  ఎర్రజెండాని గెలిపించాలి

-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

మధిర , శోధన న్యూస్ :  ప్రజల కోసం పనిచేసే ఎర్రజెండాలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. శుక్రవారం మధిర అసెంబ్లీ స్థానానికి పాలడుగు భాస్కర్ సిపిఎం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీతో పొత్తు వదులుకున్న బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బాధపడే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. సిపిఎం పార్టీతో పొత్తు వదులుకున్నందుకు జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోయే దాంట్లో భట్టి నెంబర్ వన్ స్థానాల్లో ఉన్నాడన్నారు. సిపిఎం పార్టీలో నీతి, నిజాయితీ ఉన్నా నాయకులు ఉన్నారు.అందుకే ధైర్యంగా ఓటు అడిగే హక్కు మాకు ఉందన్నారు.ఇతర పార్టీలకు ఓటు అడిగే హక్కులేదుని, డబ్బు, మందు  బిర్యాని పొట్లాలు తప్పా వాళ్ళ దగ్గర ఏమిలేవన్నారు. ఎవరి గెలిస్తే మాకేంటి ఎవరూ ఓడిపోతే మాకేంటి,ఎర్ర జెండాకు లాభం చేకూర్చటానికే పోటీలో నిలిచామన్నారు. ఎవరిలాభంతో మాకు పనిలేదని, ఈ సారి అందరిని ఓడించాలన్నారు. బిజెపిని ఓడించేందుకు మాత్రమే కలిసి కలిసి పోటీ చేద్దాం అనుకున్నాం. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో లో ఏ మంచి చూసి మీకు ఓటెయ్యాలని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులతో పొత్తు కరెక్ట్ గా జరిపి ఉంటే నేను ఓడిపోయే వాడిన కాదని భట్టి బాధపడే రోజు త్వరలోనే ఉందన్నారు. పదవుల కోసం కాదు మేము పోటీ చేసేది. రాజకీయ సిద్ధాంతాల్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకే పోటీ చేస్తున్నాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు పొన్నం వెంకటేశ్వరరావు చింతలచెరువు కోటేశ్వరావు శీలం నరసింహారావు మందా సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *