ప్రజా సంక్షేమం బిఆర్ఎస్ తోనే సాధ్యం-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ప్రజా సంక్షేమం బిఆర్ఎస్ తోనే సాధ్యం
-కరోనా కష్టకాలంలో ఆదుకున్నది సీఎం కేసీఆర్ ప్రభుత్వమే
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం, బర్లగూడెం, వెంకట్రాంపురం, నర్సంపేట కాలనీ, రేగళ్ళ మోతే, తాటి గూడెం, సీతారాంపురం, కరకగూడెం, కుర్నవల్లి, భట్టుపల్లి, కన్నయ్యగూడెం, గ్రామాలలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం కోసం వచ్చిన రేగా కాంతారావుకు మహిళలు, ప్రజలు మంగళ హారతులతో పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు భరోసాను. కల్పిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రైతు బీమా కింద ఐదు లక్షల అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో త్వరలో దళిత బంధు ను ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే పేదల జీవితాలలో వెలుగులు నిండాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ని దేశంలో రైతన్ననికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాములు, ఆనకట్టలు, చిన్న, పెద్ద లిఫ్ట్ స్కీములను సీఎం కేసీఆర్ ఓకే గొడుగు కిందకి తెచ్చారని ఈ విప్లమాత్మక నిర్ణయంతో సాగునీటి రంగం ఒక చిత్రం పూర్తిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలోని వీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇస్తుండగా…. మళ్ళీ అధికారంలోకి వస్తే రూ.16 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం క్రింద రూ.2లక్షలు. రూ.400 కి గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు రూ.3వేలు, దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, కుటుంబానికి 5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు. 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అక్కి రెడ్డి సంజీవరెడ్డి, రావుల సోమయ్య, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.