ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
-కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తాం
-వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్
కారేపల్లి, శోధన న్యూస్:
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని,
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ పూర్తిస్థాయిలో నెరవేరుస్తుందని,
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామసభలో భాగంగా గురువారం సింగరేణి మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామపంచాయతీలో ఎంపీడీవో ఎం చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ఆరు గ్యారెంటీలపై నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలకు ముఖ్యఅతిథిగా వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ పాల్గొని మాట్లాడుతూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ధన్యవాదాలు,సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు15,500 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడ్డది,పది సంవత్సరాలు పరిపాలించిన పాలకులు సుమారు 7లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మిగిల్చారని ఉన్నారు.రాష్ట్రాని అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గత పాలకులు ప్రజలను మోసం చేశారని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఆరు గ్యారెంటీలను అధికారం చేపట్టిన వెంటనే అమలు చేయుట కొరకు ప్రజా పాలన సభలు ఏర్పాటు చేశాము తప్పక ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పరుస్తామని ఆయన అన్నారు.ఇందిరమ్మ రాజ్యమంటే ప్రజల వద్దకే ప్రభుత్వమని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకము అర్హులకు అందటమే ఇందిరమ్మ రాజ్యమని ఆయన తెలిపారు.ఓసి, బీసీ ఎస్సీ పోడు రైతులకు త్వరలో ఒక పరిష్కారం ఏర్పరుస్తామని,ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి పోడూ రైతుల సమస్యలను వివరించి పోడు పట్టాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన పోడు రైతులకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పక ఏర్పరుస్తామని ప్రజల కష్టాలను తీరుస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రబోడు సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, సీఐ బి తిరుపతిరెడ్డి, సొసైటీ చైర్మన్ దుగ్గిని శ్రీనివాసరావు, ఎంపీటీసీ శివరాత్రి పార్వతి అచ్చయ్య, మాజీ ఎంపీపీలు పగడాల మంజుల, భానోత్ దేవలనాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాష్, సొసైటీ డైరెక్టర్ బానోత్ హిరాలాల్, యువ నాయకుడు ధారావత్ వినోద్ కుమార్, ఈసాల ఛాయాదేవి,కడియాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.