బతుకమ్మ ఎత్తిన కలెక్టర్ ప్రియాంక
బతుకమ్మ ఎత్తిన కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. అన్ని శాఖలలో పనిచేయుచున్న మహిళా ఉద్యోగులు రంగు రంగు పూలతో తయారు చేసిన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడారు. అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎపుడు ఉద్యోగ విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులు ఎంతో ఉల్లాసంగా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో జడ్పి సీఈఓ విద్యాలత, సంక్షేమ అధికారి విజేత, వైద్యాధికారి డా శిరీష, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, బిసి సంక్షేమ అధికారి ఇందిర తదితర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.