బాధితుని కుటుంబానికి ఆర్ధిక సహాయం
బాధితుని కుటుంబానికి ఆర్ధిక సహాయం
మణుగూరు , శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటి పరిధిలోని సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన చిట్టిపల్లి నాగేశ్వరరావు గొంతులో కణితి గడ్డ అయి బాధపడుతున్నాడు. కూలీనాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు సభ్యులు గురువారం బాధితుని కుటుంబానికి రూ.4వేలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గాజుల పూర్ణచందర్రావు, కోశాధికారి అడబాల నాగేశ్వరరావు, జోన్ చైర్మన్ కృష్ణమోహన్, భాగం రమేష్, ముత్తంశెట్టి నాగేశ్వరరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.