బీమా కావాలంటే మళ్ళీ కెసిఆరే రావాలె-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
బీమా కావాలంటే మళ్ళీ కెసిఆరే రావాలె
-బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
-బిఆర్ఎస్ పార్టీలో పలు కుటుంబాలు చేరిక
మణుగూరు, శోధన న్యూస్ : బీమా కావాలంటే సీఎం కెసిఆరే రావాలని, బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం, అభివృద్ధి లా సాధ్యమని ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామంలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో కెసిఆర్ బీమా పథకం ప్రతి ఇంటికి ధీమాగా మారబోతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. మహిళలకు నెలనెల 3 వేలు, అన్నపూర్ణ పథకం కిందట రేషన్ షాపు ద్వారా సన్నబియ్యం, మహిళా సంఘాలకు మరింత బలోపేతం చేయడం సౌభాగ్య లక్ష్మీ పథకం మహిళలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆసరా పింఛన్లు రానున్న ఐదేళ్లలో 5 వేలు దివ్యాంగుల పెన్షన్లు 6వే లకు పెంపు వ్యవసాయానికి రైతు బంధు పదహారువేలు పెంపు, మహిళలకు గ్యాస్ సిలిండర్ రూ400కు, ఆరోగ్యశ్రీ 15 లక్షలు పెంపు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు. అగ్రవర్ణ పేదలకు రాష్ట్రంలో 119 రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి పథకాలు అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని, ఎన్నికలలో మరోసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పిటిసి పోశం నర్సింహరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, పీఏసీఎస్ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్. బీఆర్ఎస్ బూత్ ఇంచార్జ్ లు, బూత్ కో ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.