బ్యాంకింగ్ లావాదేవీలపై నివేదిక అందించాలి
బ్యాంకింగ్ లావాదేవీలపై నివేదిక అందించాలి
సూర్యాపేట ,శోధన న్యూస్:శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో (జి 2)లో ఏర్పాటు చేసిన బ్యాంక్ లావాదేవీల మానిటోరింగ్ సెల్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని బ్యాంకులు, డిజిటల్ లావాదేవీలపై జరుగుతున్న నగదు మార్పిడి పై నియమించిన కమిటీ ప్రత్యేక నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ రోజు వారి నగదు మార్పిడి వివరాల నివేదికలు అందించాలని కమిటీని ఆదేశించారు.