భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
ఆళ్లపల్లి, శోధన న్యూస్ : కార్తీక మాసంలో నాగుల చవితి వేడుకను, కార్తీక మాసం శివ కేశవుల పూజకే కాదు, సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైన మాసం కావడంతో నాగుల చవితి పర్వదినాన్ని మండల వ్యాప్తంగా మర్కోడు, అనంతోగు, ఆళ్లపల్లి గ్రామాలతో పాటుగా, కు గ్రామాలలోని మహిళలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వేకువజామునే నిద్రలేచి, తలంటు స్థానాలు ఆచరించి, ఇండ్లను శుభ్రపరచుకొని, నూతన వస్త్రాలను ధరించి, ఆయా గ్రామాల సమీపంలోని ఉన్నపుట్టలలో మహిళలు ఆవుపాలు పోసి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టల వద్ద శుభ్రంచేసి మహిళలు ఆవుపాలు పోసి, నువ్వులు పిండి, కొర్రలు పిండి, సజ్జలు పిండి, వడపప్పు, పచ్చి శనగలు, అరటి పండ్లు నైవేద్యం పెట్టి పూజలు నిర్వహించారు. సర్ప దోషం లేకుండా పుట్టలకు నీళ్లు, ధని పోసి పుట్టలో పాలు పోసిన అనంతరం పుట్టమీదా పూలు, పసుపు, కుంకములతో ఘనంగా అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పూనమ్ కుమారి, పాయం చంద్రకళ, పుసం రజిత, ఉషారాణి, ఉమామహేశ్వరి, మల్లేశ్వరి, సువర్ణ, సమ్మయ్య, వల్లాల ఉమా, గౌరిశెట్టి విజయ లలిత, భారతమ్మ, శ్రీదేవి, సౌందర్య, అనసూర్య, మందాకిని, సౌజన్య, రాజ్యలక్ష్మి, భవాని, పూజ, రమా, జానకమ్మ, హైమావతి, అనూష, శ్రీలత, సుజాత, పద్మ, తాటికొండ రాధిక, శారద, గౌరమ్మ, సునీత, నాగమణి, స్వరూప, స్వప్న తదితరులు పాల్గొన్నారు.