తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

భాదిత  కుటుంబానికి యాదవ సంఘం ఆర్ధిక చేయూత 

భాదిత  కుటుంబానికి యాదవ సంఘం ఆర్ధిక చేయూత 

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని పగిడేరు గ్రామపంచాయితీ గొల్లకొత్తూరు గ్రామానికి చెందిన కావాటి వెంకన్న యాదవ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మణుగూరు మండల యాదవ సంఘం సభ్యులు మంగళవారం వారి నివాసానికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి ధైర్యం చెప్పారు. అనంతరం వెంకన్న యాదవ్ దశదిన కర్మల నిమిత్తం ఆ నిరుపేద కుటుంబానికి యాదవ పెద్దలు అందించిన సహకారంతో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఒక క్వింటా బియ్యంతో పాటు రూ.3వేలను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల యాదవ సంఘం అధ్యక్షులు మార్తి శ్రీనివాసరావు , ఉపాధ్యక్షులు జక్కుల రామలింగయ్య , పులిగిళ్ళ రమేష్ . ఆర్గనైజింగ్ కార్యదర్శి మంగి మల్లికార్జున , గోకుల కృష్ణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు గంట గోవర్ధన్ , ఉపాధ్యక్షులు మేకల గోపి , రాబిన్ కుమార్ పిళ్లై, యువజన సంఘం అధ్యక్షులు తోడేటి కుమారస్వామి ,  సభ్యులు ఊడుగుల సంపత్ , పబ్బతి సాంబశివరావు  , పగిడేరు గ్రామ పెద్దలు పులిగిల్ల వెంకటమల్లు, అశోక్ యాదవ్ కావాటి మల్లేష్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *