తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మణుగూరు లో ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం  పివి కాలనిలోని  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి బిఎస్పి నాయకులు పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… భారతదేశానికి రాజ్యాంగం రాయడానికి గొప్ప వ్యక్తిని అందించిన మహనీయురాలు రమాబాయి అంబేద్కర్ అన్నారు. ఆమె త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం మనందరి బాధ్యత అన్నారు. బహుజన కులాలన్నీ కూడా ఐక్యమై రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారం సాధించి ఆ మహనీయులు ఆశయాలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పి జిల్లా ఇంచార్జ్ నల్లగట్ల రఘు, జిల్లా అధ్యక్షులు నడిపింటి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్గుల కరుణాకర్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కేసు పాక కృష్ణ, జిల్లా ఈసీ మెంబర్ పాక వెంకటేశ్వర్లు, పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు పీక మల్లికార్జున రావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాయం సింగరాజు, నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి డబ్ల్యూసి కుమార్, బీఎ స్పీ నాయకులు కొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *