తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మధిరలో ఏడు కేజీల గంజాయి పట్టివేత 

ఏడు కేజీల గంజాయి పట్టివేత 

మధిర, శోధన న్యూస్ :మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఏడు కేజీల గంజాయిని పట్టుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఖమ్మం వారి ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్  ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం కోణార్క్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వచ్చే సమయంలో మధిర రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ ఫామ్ చుట్టు ప్రక్కల, రైల్వే ట్రాక్ ప్రక్కన గల ఖాళీ ప్రదేశాలలో నిశిత తనిఖీలు నిర్వహించారు. మధిర రైల్వే స్టేషన్ కు కొద్ది దూరంలో రైల్వే ట్రాక్ ప్రక్కన గల నిర్జన ప్రదేశంలో ఒక అనుమానిత తెల్లని ప్లాస్టిక్ సంచి మూట కనిపించింది. మూటను విప్పి పరిశీలించగా  గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.   బహిరంగ మార్కెట్లో దాని విలువ సుమారు లక్ష డెబ్భై వేల రూపాయలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి ఎవరు కలిగి ఉన్నా, అమ్మినా, రవాణా చేసినా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని   హెచ్చరించారు.   ఎన్నికల సందర్భంగా మధిర ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల రామన్నపాలెం, ఎర్రుపాలెం నిదానపురం, చిన్న బీరవెల్లి, రామచంద్రాపురం, గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై దాడులు నిర్వహించగా ఇద్దరు వ్యక్తుల వద్ద 28.8 లీటర్లు మద్యం స్వాధీనం చేసుకుని అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్నందుకు వారి పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఎవరైనా మద్యం నిల్వ చేసిన ,అమ్మిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ దాడులలో ఎస్సైలు జి చంద్రశేఖర్, ఎం శార్వాణి కానిస్టేబుల్స్ సిహెచ్.గోపి, షేక్ రియాజ్, గంగ, జ్యోతి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *