తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

-కళాశాల సీపీడీసీ ప్రధాన కార్యదర్శి మాధవరావు

ఇల్లందు, శోధన న్యూస్: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ  కళాశాల సీపీడిసీ ప్రధాన కార్యదర్శి పులిగిల్ల మాధవ రావుప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మహాత్మా జ్యోతి రావు ఫూలే 133వ వర్ధంతి సందర్భంగా చరిత్ర విభాగము ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పోలారపు పద్మ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  మహాత్మ జ్యోతిరావు చిత్ర పటానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ఆధునిక భారతదేశ చరిత్రలో మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన ఉద్యమాలు సంస్కరణలు పోరాటాలు నేటి భారతదేశ నిర్మాణానికి పునాదులుగా మారాయని మహనీయుల జీవిత చరిత్రలను విద్యార్థులు అధ్యయనం చేయడం ద్వారా భావి జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాలు దోహదపడతాయని కావున ప్రతి ఒక్కరు వారికి నిస్వార్థ జీవితం త్యాగమే నేటికీ ఆయనను స్మరణీయులుగా సమాజం చేత గుర్తించబడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం నిర్వాహకులు జి శేఖర్, వైస్ ప్రిన్సిపల్ ఎస్. బిందుశ్రీ ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ కె. కిరణ్ కుమార్, బి. చెంచు రత్నయ్య ఎస్.ఇంద్రాణి,తోడేటి రాజు, డాక్టర్ రమేష్, టి .సురేందర్ ,ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *