మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తో భారీ పంట నష్టం
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తో భారీ పంట నష్టం
సత్తుపల్లి, శోధన న్యూస్ :
మిచౌంగ్ తుఫాన్ కారణంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 20,069ఎకరాలలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాధమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ ఉపసంచాలకులు ఉల్లోజు నరసింహారావు తెలిపారు. నష్టం అంచనా ఎకరాలలో పరిశీలిస్తే పెనుబల్లి మండలంలో 6318, వేంసూరులో 4329, తల్లాడలో 4302, కల్లూరులో 4198, సత్తుపల్లిలో 922ఎకరాలలో నమోదు చేశామన్నారు. అదేవిధంగా మొక్కజొన్న పంటను పరిశీలిస్తే సుమారు 890ఎకరాలలో నష్టం వచ్చిందన్నారు. నివేదికను ప్రభుత్వానికి పంపగా ఆదేశాలు వచ్చిన వెంటనే రైతువారిగా పరిశీలన ఉంటుందని చెప్పారు. వర్షాలు తగ్గిన దృష్ట్యా వరికోతలు మొదలెట్టాలని కోరారు. నీటిని తీసేందుకు సైడ్ కాలువలు తీసుకోవాలని, వడ్లు ఆరబెట్టుకోవాలని, నీళ్లను తీసిన తర్వాత ఉప్పుద్రావణం స్ప్రే చేసినట్లయితే మొలకలు రావన్నారు. పత్తి, మిర్చీ పంటలకు యూరియా ఎకరానికి 20కేజీలు చల్లుకోవాలని సూచించారు. మొత్తంగా రైతులు ఈసారి 1.26లక్షల ఎకరాలలో వరి సాగు చేపట్టారు.