తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మినీ అంగన్వాడీల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు  -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారిణి  వేల్పుల విజేత

మినీ అంగన్వాడీల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారిణి  వేల్పుల విజేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శోధన న్యూస్ :  మినీ అంగన్వాడీల నుంచి డబ్బులు వసూలు చేస్తే శాఖ పరమైన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా సంక్షేమ అధికారిణి  వేల్పుల విజేత తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మినీ అంగన్వాడీ లను మెయిన్ అంగన్వాడీలు గా అప్ గ్రేడ్ చేసిన విషయం విదితమే అన్నారు. నేటి జనాభా పెరుగుదలను, కుటుంబాల పెరుగుదలను అనుసరించి, మినీ అంగన్వాడీలు పిల్లలకు పౌష్టికాహారం అందజేత తో పాటుగా ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కూడా అందించాల్సిన బాధ్యత ఉందన్నారు.  కాబట్టి వారు చేసే సేవలో ఉన్న కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మినీ అంగన్వాడీల నుంచి మెయిన్ అంగన్వాడీలుగా అప్ గ్రేడ్ చేస్తూ వేతనాలను కూడా పెంపు చేసినట్లు తెలిపారు.   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చర్య వలన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 626 మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలు గా మరతాయన్నారు.  దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా  జిల్లా కలెక్టర్  సమక్షంలో   జిల్లా వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ టీచర్ లకు అందచేయడం జరిగింధననరు. అయితే కొందరు దళారులు మేమే ఈ పని చేయించామంటూ మేము చేయటం వల్లే మీకు ఈ ప్రమోషన్స్ వచ్చాయంటూ మినీ అంగన్వాడీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ అంగన్వాడీ కార్యకర్త కూడా ఎటువంటి దళారులకు , వ్యక్తులకు ఎటువంటి పైకం ఇవ్వరాదని, ఇది మీ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మీకు ఇచ్చిన కానుక అని అన్నారు.  కావున ఏ అంగన్వాడీ కార్యకర్త కూడా ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ఈ సందర్భంగా ఆమె  తెలిపారు. ఒకవేళ ఎవరైనా వారిని డబ్బులు ఇవ్వవలసిందిగా అడిగినచో జిల్లా సంక్షేమ అధికారి వారి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ డబ్బులు అడిగిన వారు శాఖకు సంబంధించిన అధికారులు అయితే వారిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసి తక్షణమే వారిని విధుల నుండి సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ బయట వ్యక్తులు , దళారులు అయితే వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని ఆమె హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా డబ్బులు అడిగినట్లు సమాచారం ఉంటే ఆధారాలతో 8639969322 నంబర్ కు పిర్యాదు చేయాలని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *