మీ వెంటే మేము…
మీ వెంటే మేము…
-పినపాక సమగ్ర అభివృద్ధికి మీరు విజయం సాధించాలి…
-మీ గెలుపు కోసం సంపూర్ణంగా కృషి చేస్తాం
-పినపాక బిఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుకి బూర్గంపాడు టిడిపి శ్రేణుల మద్దతు
మణుగూరు, శోధన న్యూస్ : పినపాక నియోజకవర్గం సమగ్ర అభివృద్ది సాధించాలంటే రేగా కాంతరావు గెలుపు అనివార్యమనీ, ఈ నేపథ్యంలోనే బూర్గంపాడు మండల టిడిపి మద్దతు ఆయనకు సంపూర్ణంగా అందజేస్తామని టీడీపీ నేతలు బత్తుల నాగేశ్వరరావు, కరి వెంకటేశ్వరరావు, కుందేటి శ్రీనివాస్ రావు, కాకర్ల రామచంద్రమౌళి తెలిపారు. పినపాక అభివృద్ధికి రేగా కాంతారావు కి మద్దతు ఇస్తామని టిడిపి మండల నాయకులు అన్నారు. గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు ని కలిసి వారి సంఘీభావం తెలిపారు. అనంతరం శాలువాలతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు పినపాక లోను బిఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. బిఆర్ఎస్ అభ్యర్థిగా రేగా కాంతారావు గెలిస్తేనే గిరిజనులకు, దళితులకు, మైనారిటీలకు న్యాయం జరుగుతుందని వారు అన్నారు. ఇందుకుగాను నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు పూర్తి సహకారంతో రేగా కాంతారావు కు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయన గెలుపుతోనే పినపాక అభివృద్ధికి మలుపు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తుల నాగేశ్వరరావు , కర్రీ వెంకటేశ్వరరావు, కుందేటి శ్రీనివాసరావు , కాకర్ల రామచంద్రమౌళి , గణపత్తి సత్యనారాయణ , కరీ నరేష్ , మాలోతు విష్ణు , మాలోతు రాజేష్, యాకుబ్ ఖాన్, బతిని ఫణీంద్ర , పొట్రూ ఏసుబాబు కొంగర జయచంద్ర, కరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.