ముచ్చర్లలో తాగునీటి కొరత
ముచ్చర్లలో తాగునీటి కొరత
కామేపల్లి, శోధన న్యూస్ : ముచ్చర్ల గ్రామంలో తాగునీరు లేక స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక రంగమ్మ బజారు, రామాలయం సమీప ప్రాంతంలోని ఇళ్లకు తాగునీటి సరఫరా అరకొరగా వస్తుండడంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ప్రతిరోజు అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని అనేకమార్లు పంచాయతీ పాలకులకు, అధికారులకు విన్నవించిన స్పందనలేదని అన్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఆందోళనలో చల్లా తిరుమలరావు, బత్తుల లక్ష్మి నారాయణ,గడేపల్లి లాలమ్మ, కర్నాటి శివ, బత్తుల రాములమ్మ, భద్రమ్మ పాల్గొన్నారు.