మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన ఎమెల్యే పాయం
మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన ఎమెల్యే పాయం
అశ్వాపురం, శోధన న్యూస్:
ఇటీవల ఏఐ సీసీ అగ్రనేత రాహుల్ గాంధి పర్యటనలో భాగంగా కల్యాణపురం పరిదిలో జరిగిన ప్రమాదంలో జగ్గారం గ్రామపంచాయితీకి సంబందించిన సోడె వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతిచెందారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు, క్షతగాతృలకు 17 మందికి రూ. 4 లక్షలు ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య ,అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, ,జగ్గారం ఉపసర్పంచ్ ఆవుల వెంకటేశ్వర్లు, అశ్వాపురం కాంగ్రెస్ మండల నాయకులు ముత్తినేని శ్రీనివాసరావు, మాదినెని రాంబాబు,బొబ్బాల నాగేశ్వరరావు, పొడియం అనిల్ కుమార్,వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.