ఖమ్మంతెలంగాణ

యాదవులు రాజకీయ శక్తిగా ఎదగాలి – డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

యాదవులు రాజకీయ శక్తిగా ఎదగాలి

– డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
కామేపల్లి, శోధన న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో యాదవులు కురుమలు మేజర్ గా ఉన్న గ్రామాల్లో సర్పంచి ,ఎంపీటీసీ ఎంపీపీ, జెడ్పీటీసీ లు గా పోటీ చేయాలని, స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులతో సఖ్యతగా ఉండి, స్నేహపూర్వకంగా కొట్లాడి టికెట్లు తెచ్చుకుని గెలిచి రాజకీయ శక్తిగా ఎదగాలని పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.కల్లూరు మండలం ముచ్చవరం గ్రామం నుండి దాదాపు 100 మంది యాదవులు కామేపల్లి మండలం పండితాపురం చేరుకుని మల్లి బాబు యాదవ్ ని వారి స్వగృహంలో కలిసి గొర్రెల కోసం డీడీలు తీసి రెండు సంవత్సరాల అయిందని, కురుమ యాదవుల మరియు పలు రకాల సమస్యల ను ప్రస్తావించగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గొర్రెల కోసం డీడీలు తీసిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని, ఎవరు ఆందోళన చెందనవసరం లేదని హామీ ఇచ్చారు.గతంలో మన యాదవ పెద్దలు లాగా గొర్రెలు కావాలి బర్రెలు కావాలని కాకుండా బాధ్యతగా మన పిల్లలకు మంచి ఉన్నత విద్యఅందించాలని, అదేవిధంగా ఐక్యతతో వర్గాలకతీతంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో పోటీ చేయాలని సూచించారు.ఎందుకంటే గత 40 సంవత్సరాల నుండి కులాలే రాజకీయాలను శాసిస్తున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ రాంబాబు తేలు నాగరాజు, శీ లం జమలయ్య వర్ధ పోయిన పుల్లారావు,ఎనుముల వెంకయ్య శీలం తిరుపతరావు,గోసు నాగయ్య తేలు రామకృష్ణ,దరగయ్య, గోసు కృష్ణ రాచ బంటి కృష్ణ,తదితర యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *