తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన హెవీ వాటర్ ప్లాంట్ జీఎం

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన హెవీ వాటర్ ప్లాంట్ జీఎం
అశ్వాపురం, శోధన న్యూస్: భద్రాద్రి కోతగుడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం  గౌతమి నగర్ కాలనీలో గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆదివారం మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ జిఎం జగ్గారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ-హన్మకొండ, అశ్వాపురం గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ సంయుక్త అద్వర్యంలో  రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 1200 యూనిట్ల బ్లడ్ ను   సేకరించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇప్పటివరకు తొమ్మిది  రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 95 యూనిట్ల బ్లడ్ను సేకరించినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అనేకం నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిఎం నిర్వాహకులను అభినందించారు అనంతరం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం జి శ్రీనివాస్, హెచ్ కె శర్మ, డాక్టర్ విజయ్ కుమార్, ఎం చైతన్య, ఎం ప్రదీప్, కే సోమయ్య, ఈ నారాయణరాజు, వైజయ్ కుమార్ జ్యోతి రెడ్డి, ఏ లక్ష్మి రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు శ్రీనివాస్, మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *