విజయవంతంగా రక్తదాన శిబిరం
విజయవంతంగా రక్తదాన శిబిరం
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ల వారీగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు.కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రాంభించారు. పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు స్థానికులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా రక్తదాన శిబిరంలో సుమారుగా 120 మంది రక్తదానం చేశారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ సాయి మనోహర్ మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా ఎస్పీ గారి సూచనలతో చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన రావడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు.రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని,రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అరటిపండ్లు,పండ్ల రసాలలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయబాబు, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఎస్బి సిఐ నాగరాజు, సిఐలు పెద్దన్నకుమార్, కరుణాకర్, రమేష్, మురళి, ఆర్ఐలు రవి, సుధాకర్, నరసింహారావు, సబ్ డివిజన్లోని ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.