వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం
వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం
అశ్వాపురం, శోధన న్యూస్: అశ్వాపురం మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెంచల రాము, బీసీ సెల్ అధ్యక్షులు బచ్చు వెంకటరమణ, కార్యవర్గ సభ్యులు చింతా రవి, వారి అధ్యక్షతన టీపీసీసీ మెంబర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ ల గురించి ముఖ్యంగా మహిళలకు ప్రతినెల 2500 రూపాయలు మీ యొక్క ఖాతాలో జమ చేయబడుతుందనీ, ప్రతి మహిళకి అదేవిధంగా గ్యాస్ 500 రూపాయలకే అందించనున్నదన్నారు. మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతు భరోసా పేరు మీద రైతులకి కవులు రైతులకి ఇద్దరికీ 15000 రూపాయలు, అలాగే 200 యూనిట్లు వరకు ఉచితంగా కరెంటు, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, విద్యా భరోసా కార్డు మీద చదువుకునే పిల్లలకు విద్యా భరోసా పథకంలో ఐదు లక్షల రూపాయలు అందజేస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు బసిరుద్దీన్, మణుగూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు లతీఫ్, తాటి వెంకటేశ్వర్లు, చేప లక్ష్మీ నర్సు, రవి, తదితరులు పాల్గొన్నారు.